Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.78 కోట్ల మందికి రైల్వేశాఖ ఫైన్..
న్యూఢిల్లీ: తొమ్మిది నెలల్లో 1.78 కోట్ల మంది ప్రయాణికుల నుంచి జరిమానాల రూపంలో రైల్వే శాఖ వసూలు చేసింది. 2021-22 మొదటి తొమ్మిది నెలల్లో.. టికెట్లు లేకుండా, అదనపు లగేజీకి రుసుము చెల్లించకుండా ప్రయాణించిన వారివద్ద నుంచి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసినట్టు పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐలో దాఖలు చేసిన ప్రశ్నకు రైల్వే బోర్డు స్పందించింది. ఇందుకు సంబంధించిన డేటాను అందుబాటులోకి తెచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో ప్రయాణ, ఫ్లాట్‌ఫామ్, లగేజీ టికెట్ లేకుండా ఉన్న 1.78 కోట్ల మందిని గుర్తించినట్టు బోర్డు తెలిపింది. వారి వద్ద నుంచి జరిమానాల రూపంలో 1,017.48కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించింది. ఈ వసూళ్లు 2019-2020 కంటే 79 శాతం అధికమని వివరించింది. కోవిడ్ నిబంధనల ఎత్తివేతతో పెరిగిన ప్రయాణాలు, ఆన్లైన్ బుకింగ్‌తో చాలా మంది బుక్ చేసుకోకుండానే రైలు ఎక్కడం భారీ జరిమానాలకు కారణమని ఓ అధికారి వెల్లడించారు.
అయితే ప్రధాని మోడీ ఇటీవల రైల్వేప్రయాణికుల కోసం ఓ ప్రకటన చేశారు.
ఎవరైనా టిక్కెట్ లేకుండా రైలు ఎక్కి..రైల్లోనే తీసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టు వెల్లడించిన విషయం విదితమే. అయినా ప్రయాణికులనుంచి రైల్వే అధికారులు జరిమానా రూపంలో భారీగానే పిండుకుంటున్నారని రైలు ప్రయాణికుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.