Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. వరుసగా రెండోరోజూ 20 వేల దిగువనే నమోదయ్యాయి. తాజాగా మరణాల సంఖ్య కూడా తగ్గింది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ కరోనా గణాంకాలను విడుదల చేసింది. ఆదివారం 8 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 16,051 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వైరస్ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 2020 జనవరి నుంచి 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 5,12,109 మంది చనిపోయారు. కోవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 2 లక్షలకు దిగొచ్చాయి. మొత్తం కేసుల్లో అవి 0.47 శాతానికి సమానం. రికవరీ రేటు 98.33 శాతం కాగా.. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.