Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : యూపీలో బుధవారం నాలుగోదశ ఎన్నికల్లో 59 నియోజకవర్గాల భవితవ్యం తేలనున్నది. లఖింపూర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై నుంచి కేంద్రమంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో తొక్కించిన ఘటన దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చర్చ జరపాలంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఈ ప్రాంతం రాజకీయంగా కీలకంగా మారింది. బుధవారం ఈ నియోజకవర్గం సహా పిలిబిత్, సితాపూర్, ఉన్నావో, హర్దోయి, లక్నో, రారుబరేలి, బందా, ఫతేపూర్లలో పోలింగ్ జరగనున్నది. ఈ జిల్లాలకు చెందిన 624 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2017 ఎన్నికల్లో లఖింపూర్ ఖేరి స్థానం నుంచి బీజేపీ నేత యోగేష్ వర్మ, సమాజ్ వాది పార్టీకి చెందిన ఉత్క్రష్ వర్మపై 37వేల ఓట్లతో విజయం సాధించారు. కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరుమిశ్రాకూ లఖింపూర్ ఖేరి నియోజకవర్గంలో భాగముంది. బీజేపీ, ఎస్పీలు ఈ ఎన్నికల్లో కూడా ఆ అభ్యర్థులనే బరిలోకి దింపింది.
కాంగ్రెస్ నుంచి రవిశంకర్ త్రివేది, బీఎస్పీ నుంచి మోహన్ వాజ్పారులు పోటీ పడుతున్నారు.