Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. తహ్లివాల్ ఇండ్రస్టీయల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ ఆర్జిత్ సేన్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. క్షతగాత్రులను ఉనాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందించనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.