Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీబీఎస్ఈతో పాటు పలు బోర్డులు నిర్వహించనున్న క్లాస్ 10,12 ఆఫ్‌లైన్ బోర్డు పరీక్షలు నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై నేడు (బుధవారం) విచారణ చేపడతామని పేర్కొంది. ఈ పిటిషన్ ముందస్తు కాపీని సీబీఎస్ఈ స్టాడింగ్ కౌన్సెల్‌కు, సంబంధిత ప్రతివాదులకు అందజేయాలని జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, సిటి రవికుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ పరీక్షల నిలిపివేతపై అత్యవసర విచారణ చేపట్టాలని అనుభ శ్రీవాత్సవ సహారు పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26 నుంచి 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.