Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైలో క్లీన్‌స్వీప్!
చెన్నై: తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే హవా కొనసాగుతోంది. చెన్నై కార్పొరేషన్లో క్లిన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోనూ డీఎంకే జోరే కొనసాగుతోంది. కోయంబత్తూరులో 75 శాతానికిపైగా స్థానాల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. సాయంత్రం వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. రాష్ట్రంలోని కార్పొరేషన్లలో మొత్తం 1374 వార్డులకు గాను 425 స్థానాల్లో డీఎంకే జయభేరి మోగించగా.. 75చోట్ల అన్నాడీఎంకే గెలుపొందింది. అలాగే, పురపాలికల్లో 3843 వార్డు సభ్యుల సీట్లకు గాను డీఎంకే 1832 గెలుచుకోగా.. అన్నాడీఎంకే 494 స్థానాలకే పరిమితమైంది. అలాగే, 7621 పట్టణ పంచాయతీలకు గాను 4261 చోట్ల డీఎంకే గెలుపొందగా.. అన్నాడీఎంకే 1178 చోట్ల విజయం సాధించింది. కాగా చెన్నై మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 200 వార్డులకు గాను 192 స్థానాల ఫలితాలు వెలువడగా.. 146చోట్ల డీఎంకే గెలుపొందగా.. అన్నాడీఎంకే కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. 3 వార్డుల్లో గెలుపుతో కాంగ్రెస్ మూడో స్థానంలో కొనసాగుతోంది.