Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ పే ఎండి సతీమణి నిర్వాకం
- ఇరువురిపై చర్యలు
న్యూఢిల్లీ : సొంత సరదాల కోసం కంపెనీ సొమ్మును వృదా చేసిన భారత్ పే మేనేజింగ్ డైరెక్టర్ సహ వ్యవస్థాపకులు, ఎండి అష్నీర్ గ్రోవర్, ఆయన సతీమణి మాధురీ జైన్ పై ఆ సంస్థ చర్యలు తీసుకుంది. ఈ ఫిన్టెల్లో గత కొంత కాలంగా వీరి ఇరువురి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అంతర్గత ప్రాథమిక విచారణ తర్వాత అష్నీర్‌ను సెలవుల మీద పంపించారు. ఆయన భార్య మాధురీ జైన్‌ను కంపెనీ నుంచి తొలగిస్తూ భారత్ పే నిర్ణయం తీసుకుంది. కంపెనీ కంట్రోలర్ హౌదాలో పని చేస్తుంది. ఆమె పేరిట కంపెనీలో ఉన్న వాటాను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ కంట్రోలర్ హౌదాలో ఆర్థికపరమైన అవకతవకలకు మాధురి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యిందని సమాచారం. కంపెనీ సొమ్ముతో మాధురీ సౌందర్య ఉత్పత్తులు, దుస్తులు, విద్యుత్ పరికరాలు కొనుగోలు చేసినట్లు తేలిందని సమాచారం. మధురీ ఇంకో అడుగు ముందుకేసి అమెరికా, దుబారు తదితర పలు దేశాలకు కుటుంబ సమేతంగా ప్రయాణలు చేశారని ఆరోపణలు నెలకొన్నాయి. అబద్దపు ఇన్వాయిస్లతో బిల్లులు పెట్టిందని సమాచారం.