Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ముంబయి అండర్ డాన్ దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈ కేసులో విచారించేందుకు బుధవారం ఉదయం 6 గంటలకు ఇడి అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన్ను గంటపాటు విచారించి.. అనంతరం ఇడి కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. మోడీ సర్కార్.. కొంత మందిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగిస్తుంటూ మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వం విరుచుకుపడుతున్న వేళ.. ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
నవాబ్ మాలిక్ నోరు నొక్కేసేందుకు కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఎన్సీపీ, శివసేన నేతలు దుయ్యబట్టారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా దీనిపై స్పందించారు. నవాబ్ మాలిక్‌పై ఇలాంటి దాడులు జరుగుతాయని ఊహించామని, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా దావూద్ పేరు చెప్పి ... తనను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ట్రిక్ ప్లే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై సిబిఐ, ఇడిలను ప్రయోగిస్తున్నారని శివసేన ఎంపి సంజరు రౌత్ అన్నారు. మాలిక్ నిజాలను బయటపెడుతున్నారనే భయంతో, రాజకీయ దురుద్ధేశంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇలా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పాత విషయాలను తిరిగి తోడుతున్నారని, 2024 నుండి మీరు కూడా విచారణలు ఎదుర్కొవలసి ఉంటుందని హెచ్చరించారు. కాగా, ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సమయాన. ఎన్‌సిపి కార్యకర్తలు.. ఈడీ కార్యాలయానికి సమీపంగా ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.