Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఐజీ స్థాయి పోలీస్ అధికారులూ డిప్యూటేషన్‌పై కేంద్రానికి
- రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి ఉన్నా.. లేకున్నా.. వెళ్లాల్సిందే..
న్యూఢిల్లీ : అఖిల భారత సర్వీసుల విషయంలో మోడీ సర్కార్ మరో వివాదానికి తెరలేపింది. రాష్ట్రాల్లో పనిచేస్తున్న డీఐజీ స్థాయి అధికారుల్ని కూడా కేంద్ర డిప్యూటేషన్‌పై తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి అఖిల భారత సర్వీసు నిబంధనల్లో మార్పులు చేయబోతున్నట్టు ఆయా రాష్ట్రాలకు కేంద్రం అధికారికంగా తెలిపింది. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓల సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేయబోతున్నామని ఫిబ్రవరి 10న కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర..రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని వివిధ రాజకీయ పార్టీలు, పలు రాష్ట్రాలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. సర్వీస్ నిబంధనల్లో చేస్తున్న మార్పుల ప్రకారం, రాష్ట్రాల్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓలను కేంద్ర డిప్యూటేషన్‌పై వెళ్లాలంటే..అందుకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు. నిర్దేశిత గడువులోగా ఆ అధికారిని రాష్ట్రం రిలీవ్ చేయకపోయినా..అధికారి డిప్యూటేషన్‌పై వెళ్లాల్సిందే. తాజాగా దీనికి సంబంధించి మరో ఉత్తర్వును కేంద్రం జారీచేసింది. డీఐజీ స్థాయి అధికారుల్ని సైతం డిప్యూటేషన్‌పై తీసుకెళ్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దీనికి రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని పేర్కొన్నది. ''అఖిల భారత సర్వీస్ నిబంధనల్లో మార్పులపై కేంద్ర హోంశాఖ చేసిన ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదించింది. డిప్యూటేషన్‌పై కేంద్రానికి వచ్చిన డీఐజీ స్థాయి అధికారుల ఎంప్యానల్మేంట్ నిబంధనల్ని సవరిస్తున్నా''మని కేంద్రం తాజాగా తెలిపింది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం జిల్లా ఎస్పీ స్థాయి అధికారి డిప్యూటేషన్‌పై కేంద్రానికి వెళితే ఎంప్యానల్మేంట్కు అర్హుడు కాదు. డీఐజీ స్థాయి అధికారి అయినా..అతడికి కనీసం 14ఏండ్ల సర్వీస్ ఉండాలి. ఉన్నతాధికారిగా అతడి సామర్థ్యం, నిబద్ధత, అవినీతి రహితుడు అనే రికార్డు కలిగివుండాలి. తాజా ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రాల్లోని డీఐజీ ర్యాంక్ అధికారి..కేంద్రానికి డిప్యూటేషన్‌పై వెళితే..అతడికి డీఐజీ స్థాయి ఎంప్యానల్మేంట్ దక్కుతుంది. ఈనేపథ్యం లో ఏ అధికారినైనా డిప్యూటేషన్‌పై కేంద్రం పిలిపించే అవకాశం ఏర్పడింది. రాష్ట్రాల అభిప్రాయానికి చోటు లేదు.