Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కతా హైకోర్టు ఆదేశం
కొల్కతా : విద్యార్థి నాయకుడు అనీష్ ఖాన్ పార్థివ దేహానికి హౌరా జిల్లా జడ్జి పర్యవేక్షణలో రెండోసారి పోస్టు మార్టమ్ నిర్వహించాలని కోల్‌కతా హైకోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. అనీష్ ఖాన్ మృతిపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రొగ్రెస్ నివేదికను రెండువారాల్లో సమర్పించాలని ఆదేశించింది. విచారణ కోసం అనీష్ ఖాన్ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. అనీష్ ఖాన్ మృతిని సుమోటాగా స్వీకరించి విచారణ చేస్తున్న జస్టిస్ రాజశేఖర్ మంతా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. అనీష్ ఖాన్ మృతిపై సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు అతని ఫోన్‌ను సిట్‌కు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. గురువారం వాదనల్లో ఖాన్ హత్యకు గురయ్యారని సీనియర్ న్యాయవాది బికాష్ భట్టాచార్య వాదించారు. ఖాన్‌పై నలుగురు వ్యక్తులు దారుణంగా దాడి చేశారని, వీరిలో ఒకరు పోలీసు యూనిఫాంలో ఉన్నారని తెలిపారు.
అనీష్ నివాసముంటున్న రెండో అంతస్తు నుంచి అతనిని బయటకు విసిరివేశారని చెప్పారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే అనీష్ ఖాన్ హత్య జరిగిందని బికాష్ భట్టాచార్య చెప్పారు.