Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోక్యం చేసుకోవాలని మోడీకి ఉక్రెయిన్ రాయబారి వినతి
న్యూఢిల్లీ : రష్యా సైనికచర్యతో ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ సాయాన్ని ఉక్రెయిన్ కోరింది. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడాలని అభ్యర్ధించింది. ఈ మేరకు ఉక్రెయిన్ రాయబారి గురువారం డాక్టర్ ఇగర్ పోలికా ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోడీ వెంటనే ఉన్నత స్థాయి చర్చలు జరపాలని, ఘర్షణలను నివారించాలని కోరారు. అంతర్జాతీయంగా భారత్ చాలా ప్రభావవంతమైన దేశమని, ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో ఇగర్ కోరారు. అలీనోద్యమ నాయకురాలిగా భారత్‌కు గల పేరు ప్రఖ్యాతులను దృష్టిలో వుంచుకోవాలని అన్నారు. శాంతి స్థాపనే లక్ష్యంగా ప్రపంచ ఉద్రిక్తతలను నివారించే లక్ష్యంతో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అలీనోద్యమం ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో భారత్ సాయం తమకు చాలా కీలకమని వ్యాఖ్యానించారు.