Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టాన్ని ఆమోదించడం ద్వారా మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులో తమ తీర్పును కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. గురువారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ ''జస్టిస్ రావు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ప్రభుత్వం గౌరవించలేదు. ప్రభుత్వం వెంటనే చట్టాన్ని సవరించింది'' అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. మద్రాస్ బార్ అసోసియేషన్‌లో ఈ కోర్టు కొట్టివేసిన నిబంధనలకు వాస్తవంగా ప్రతిరూపంగా పేర్కొంటూ ట్రిబ్యునల్స్ చట్టాన్ని ఆమోదిం చినందుకు ప్రభుత్వాన్ని ఇంతకుముందు కూడా విమర్శించింది. ట్రిబ్యునల్స్‌లోని నియామకాలకు సంబంధించి దేశమంతటా ట్రిబ్యునల్స్‌లో దాదాపు అన్ని ఖాళీలు అటార్నీ జనరల్ తెలియజేసినట్లు ధర్మాసనం పేర్కొంది. అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ పంపిన ఈమెయిల్ ప్రకారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) సహా కొన్ని ట్రిబ్యునల్లు మినహా దాదాపు అన్ని ఖాళీలలను భర్తీ చేసినట్టు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్, సెంట్రల్అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్ల నియా మకం ఇప్పటికీ కోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలోని ఎంపిక కమిటీతో పెండింగ్‌లో ఉన్నదని సీజేఐ పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది అర వింద్ దాతర్ ట్రిబ్యునల్స్, ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంలోని ఖాళీలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినతరువాత ఈపరిశీలన జరిగింది.