Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని కోరిన సుప్రీం
న్యూఢిల్లీ : డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్ చట్టబద్ధతపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రాన్ని కోరింది. గెయిన్ బిట్‌కాయిన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరుపుతోంది. ఈ కేసులో నిందితుడు అజరు భరద్వాజ్ అరెస్టుపై స్టేను ఎత్తివేయాల ంటూ ఈడీ తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి చేసిన వాదనపై స్పందిస్తూ బెంచ్ పై వివరణ కోరింది. ఈ కేసులో నెలకొన్న పరిస్థితిపై గతేడాది జులై 30న ఈడీ ఒక నివేదిక అందచేసింది.విచారణ సమయంలో భరద్వాజ్ తమకు సహకరించడం లేదని ఐశ్వర్య భాటి తెలిపారు. రూ.20వేల కోట్ల విలువ చేసే దాదాపు 80వేల బిట్కాయిన్లను సమీకరించారన్న ఆరోపణలపై భరద్వాజ్‌ను అరెస్టు చేయాలని, అరెస్టుపై గల స్టేను ఎత్తివేయాలని ఆమె కోరారు. అయితే స్టేను తదుపరి విచారణా తేదీ అయిన మార్చి 28వరకు కోర్టు పొడిగించింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి దర్యాప్తుకు పూర్తిగా సహకరించాల్సిందిగా భరద్వాజ్‌ను బెంచ్ ఆదేశించింది. రెండు రోజుల్లో ఇడి ముందుకు హాజరు కావాల్సిందిగా కోరింది. మార్చి 25లోగా తాజా పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఈడీని కోర్టు కోరింది.