Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాతృభాష వినియోగాన్ని ఎన్ఈపీ నొక్కి చెబుతుంది : మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) మాతృభాష వినియోగాన్ని నొక్కి చెబుతోందని ప్రధాని మోడీ అన్నారు. ప్రాంతీయ భాషల్లో కూడా ప్రొఫెషనల్ కోర్సులను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ప్రపంచంలోని పురాతన భాష తమిళం భారతదేశంలో ఉందని ప్రతి పౌరుడు గర్వపడాలని అన్నారు. ఆదివారం 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ మాతృభాష, అమ్మ రెండూ కలిసి జీవితపు పునాదిని పటిష్టపరుస్తాయి. శాశ్వతత్వాన్ని అందిస్తాయి. మనము మన తల్లిని విడిచిపెట్టలేం. అలాగే మన మాతృభాషను కూడా విడిచిపెట్టలేం'' అని అన్నారు. 121 రకాల మాతృ భాషలతో ముడిపడి ఉండటం దేశం గర్వించదగ్గ విషయమనీ, వాటిలో 14 నిత్య జీవితంలో కోటి మందికి పైగా మాట్లాడేవారని అన్నారు.