Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డిమాండ్
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను రక్షించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వి.పి సాను, మయూఖ్ బిస్వాస్ ప్రకటన విడుదల చేశారు. కివ్, ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాల నుంచి భారతీయ విద్యార్థులను సమర్థవంతంగా రక్షించాలని డిమాండ్ చేశారు.రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం కారణంగా వేలాది మంది భారతీయ విద్యార్థులు, భారతీయులు ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా రాజధాని కివ్లోనూ చిక్కుకుపోయారు. తూర్పు ఐరోపా, కివ్లోని నగరాల్లో వైద్య విద్య, ఇతర సంబంధిత కోర్సులను అభ్యసించే భారతీయ విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం రూపంలో కేంద్ర ప్రభుత్వానికి, దాని ప్రతినిధికి తరలింపు కార్యకలాపాలను ప్రారంభించడానికి తగినంత సమయం ఉందని, కాని ఇప్పుడు విద్యార్థులు తమ ఇండ్లు, వసతి .గృహాలను విడిచిపెట్టి, షెల్లింగ్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బంకర్లు, భూగర్భ మెట్రో స్టేషన్లల్లో నివసించవలసి వస్తుందని, అక్కడి పరిస్థితి మరింత దిగజారడం వల్ల ఉక్రెయిన్లోని భారతీయులు తమను తాము రక్షించుకోవడానికి ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు.జాతీయ క్యారియర్ అందుబాటులో లేకపోవడం సమస్యలను మరింత తీవ్రతరం చేసిందని అన్నారు. విద్యార్థులు విమాన టిక్కెట్ల కోసం అధిక మొత్తంలో చెల్లించవలసి వచ్చిందని, విమాన టిక్కెట్లు సాధారణ ధర కంటే దాదాపు 4-5 రెట్లు పెరిగాయని అన్నారు. అలాగే, ప్రభావిత ప్రాంతాల నుంచి వస్తున్న వార్తల బట్టీ విద్యార్థులు దాదాపు 2000 కిలోమీటర్ల దూరం రొమేనియా, పోలాండ్ వంటి పశ్చిమ సరిహద్దులకు ప్రయాణించాల్సి వస్తుందని అన్నారు. అక్కడి నుండి కేంద్ర ప్రభుత్వం వారి తరలింపుకు ఏర్పాట్లు చేసినట్లు తమకు తెలుస్తుందని, వారం రోజులుగా మెట్రో స్టేషన్లలో బతుకుతున్న విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందనే విషయం కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తక్షణమే తరలించడానికి, అనారోగ్యంతో ఉన్న వారి కుటుంబాలకు సురక్షితంగా తీసుకురావడానికి సరైన పద్ధతులను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.