Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోహతక్ : మూడు వారాల బెయిల్ ముగిసిపోవడంతో డేరా సచా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ సోమవారం మళ్లీ రోహతక్ జిల్లాలోని సునరియా జైలుకు చేరుకున్నాడు. తన ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై లైంగికదాడి కేసులో డేరా చీఫ్ 20 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గురుగ్రామ్‌లో ఉన్న తన కుటుంబాన్ని కలుసుకోవడానికి ఫిబ్రవరి 7న మూడు వారాల బెయిల్ డేరా చీఫ్‌కు లభించింది. ఈ బెయిల్ ముగిసిపోవడంతో సోమవారం గురుగ్రామ్ నుంచి సోమవారం మధ్యాహనానికి అత్యంత భద్రత మధ్య సునరియా జైలుకు చేరుకున్నాడు. ఖలిస్తాన్ మద్దతుదారుల నుంచి డేరా చీఫ్ ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉందనే కారణంగా ఈ మూడు వారాలు అతనికి కేంద్రం జెడ్ ప్లస్ భద్రతను కూడా కేంద్రం కల్పించింది.