Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదమ్పూర్ : కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్లు సోమవారం అధికారులు తెలిపారు. సమ్రోలి- ఉదమ్పూర్ల మధ్య గల ఈ రహదారిని మూసివేశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా కనిష్ట ఉష్ణోగ్రత పదిడిగ్రీల సెల్సియస్కి పడిపోగా, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదు కావచ్చని ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆకాశం మేఘావృతం కావచ్చని అన్నారు.