Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య సిలిండర్ ధర బాదుడు
న్యూఢిల్లీ : ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2వేలు దాటింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను కూడా రూ.27 పెంచాయి. కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.105 పెంచుతూ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు మార్చి 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడిం చాయి. తాజా పెంపుతూ కోల్‌కతాలో రూ.2,089, ముంబయిలో రూ.1962, చెన్నైలో రూ.2,185.5గా ఉంది. ఇక 5 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.569కి చేరింది. కాగా.. ఫిబ్రవరి 1నే వాణిజ్య సిలిండర్‌పై రూ.91.50 తగ్గించగా.. సరిగ్గా నెల రోజులకు రూ.105 పెంచడం గమనార్హం. హోటళ్లు, రెస్టారెంట్లలో ఈ వాణిజ్య సిలిండర్లు వాడుతుంటారు. వీటి ధర పెరగడంతో బయట కొనుగోలు చేసే ఆహార పదార్థాల ధరలు కూడా పెరగనున్నాయి.