Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు అసెంబ్లీ మార్చ్‌కి పిలుపు
- ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు
న్యూఢిల్లీ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ హర్యానాలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 85వ రోజుకు చేరింది. కాగా, నేడు (గురువారం) అసెంబ్లీ మార్చికి ఉద్యోగుల జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలను మూకుమ్మడి అరెస్టులు చేస్తున్నారు. పల్వాల్, రెవారీ, మహేందర్‌గఢ్ తదితర ప్రాంతాల్లోని కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు.