Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగంలోని అతి పెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా సునీల్ అగర్వాల్ నియమితులయ్యారు. ఇంతక్రితం ఆయన రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. ఈ కంపెనీలో 12 ఏండ్ల పాటు సీఎఫ్ఓగా బాధ్యతలు
ప్రయివేటు వ్యక్తికి ఎల్ఐసీ సీఎఫ్ఓ బాధ్యతలు చూశారు. అలాగే, ఐదేండ్లు ఐసీఐసీఐ ప్రుడెన్సీయల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పనిచేశారు. ఓ ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలో పని చేసిన వ్యక్తికి ఎల్ఐసీలోని అత్యున్నత హోదాల్లో ఒక్కటైన సీఎఫ్ఓ అవకాశం కల్పించడం గమనార్హం. మూడేండ్ల కాలానికి గాను అగర్వాల్ సీఎఫ్ఓగా కొనసాగనున్నారు. ఏడాదికి రూ.75 లక్షల వేతనం చెల్లించనున్నారు.