Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల గురించి తాము ఆందోళన చెందుతున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. అక్కడ జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న వారిపట్ల తమకు సానుభూతి ఉందని, అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో న్యాయస్థానం చేయగలిగిందేమీ లేదని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు సంబంధించి సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా సీజేఐ పై వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో గురించి సీజేఐ ప్రస్తావించారు. '' సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నారని అందులో ప్రశ్నిస్తున్నారు. ఈ సైనిక చర్యను ఆపండని నేను రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలనా?'' అని సీజేఐ వ్యాఖ్యానించారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎ.ఎం.దార్ వాదనలు వినిపిస్తూ అక్కడ చిక్కుకున్న భారతీయులు చలిలో గడ్డకట్టుకుపోతున్నారని, వారిని కాపాడాలని న్యాయస్థానాన్ని కోరారు. ఉక్రెయిన్ సరిహద్దుల్ని భారతీయులు దాటారా? లేదా? చెప్పాలని అటార్నీ జనరల్‌ను కోరారు. కేంద్ర ప్రభుత్వం పలువురి మంత్రుల్ని ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపిందని, వారు భారత్‌కు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు.