Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్వెస్లర్ల ఆసక్తులే ముఖ్యం : దీపమ్ సెక్రటరీ
ముంబయి : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాల విక్రయం వాయిదా పడనుందని తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ పరిణామాలతో మార్కెట్లలో అస్థిరత నెలకొన్న నేపథ్యంలో ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను ప్రస్తుత మార్చిలో నిర్వహించడం వీలుకాదని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఓ అధికారి ధ్రువీకరించినట్టు రిపోర్ట్లు వస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపిఒకు పెట్టాలని కేంద్రం భావిస్తోందన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారంలోగా రావొచ్చని తెలుస్తోంది. కాగా.. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎల్ఐసి వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి.