Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిన్న వయస్కురాలిగానూ రికార్డు
చెన్నై : తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరమైన చెన్నై నగర పాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఓ దళిత మహిళ ఎన్నికయ్యారు. ఆర్ ప్రియ (28)ను ఈ పదవికి డీఎంకే నామినేట్ చేసింది. ఈ పీఠాన్ని అలంకరించిన తొలి దళిత వ్యక్తిగానే కాకుండా అతి పిన్న వయస్కురాలుగానూ, మూడో మహిళగానూ కూడా ఆమె రికార్డు సష్టించారు. నార్త్ చెన్నరులోని తిరు వి కా నగర్‌కు చెందిన ఆర్ ప్రియ 74వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. జీసీసీలో 200 వార్డులు ఉండగా డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. చెన్నైకు గతంలో తారా చెరియన్, కమాక్షి జయారామన్లు మహిళా మేయర్లుగా పనిచేశారు. ప్రియా మూడో మహిళగా నిలవనున్నారు. ప్రియకు బలమైన రాజకీయ నేపధ్యం ఉంది. ప్రియా తాతయ్య చెంగయ్య శివం గతంలో డీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి ఆర్ రాజన్ ఈ ప్రాంత డీఎంకే సహ కార్యదర్శిగా ఉన్నారు.