Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొచ్చి: సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శిగా కొడియేరి బాలకృష్ణన్ (70) ఎన్నికయ్యారు. కొచ్చిలోని బి రాఘవన్నగర్లో నాలుగు రోజులపాటు జరిగిన రాష్ట్ర మహాసభలు శుక్రవారంతో ముగిసాయి. ఈ మహాసభలో కొడియేరిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. పినరయి విజయన్ తర్వాత 2015లో ఆలప్పుజలో జరిగిన రాష్ట్ర మహాసభలోనూ, 2018లో త్రిసూర్‌లో జరిగిన రాష్ట్ర మహాసభలోనూ ఆయన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. కేరళ మాజీ హోంమంత్రి కొడియేరి బాలకష్ణన్ ఇప్పుడు వరుసగా మూడోసారి ఆ బాధ్యతలు చేపట్టారు. అలాగే, 17 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం, 88 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర కమిటీని మహాసభ ఎన్నుకున్నది. కార్యదర్శివర్గంలో పినరయి విజయన్, కొడియేరి బాలకృష్ణన్, ఇపి జయరాజన్, డా|| టిఎం థామస్ ఐసాక్, పికె శ్రీమతి, ఏకె బాలన్, టిపి రామకృష్ణన్, కెఎన్ బాలగోపాల్, పి రాజీవ్ ఎన్నికయ్యారు. కెకె జయచంద్రన్, అనవూర్ నాగప్పన్, విఎన్ వాసవన్, సాజి చెరియన్, ఎం స్వరాజ్, పిఎ మహమ్మద్ రియాస్, పికె బిజు, దినేషన్ కార్యదర్శివర్గంలోకి కొత్తగా తీసుకున్నారు. కేరళ అభివృద్ధిని వివరించే విధాన పత్రాన్ని పినరయి విజయన్ ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 25 ఏండ్ల వ్యవధిలో అభివద్ధి చెందిన దేశాల స్థాయికి జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో ఈ పత్రాన్ని రూపొందించారు. మహాసభల ముగింపు సందర్భంగా మెరైన్ డ్రైవ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగింది. దీనిని పినరయి విజయన్ ప్రారంభించారు. ఈ సభలో సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నూతనంగా ఎన్నికైన కార్యదర్శి కొడియేరి బాలకష్ణన్, సెక్రటేరియట్ సభ్యుడు పి రాజీవ్, జిల్లా కార్యదర్శి సిఎన్ మోహనన్ ఈ సభలో ప్రసంగించారు.