Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దీర్ఘశ్రేణి బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని భారత నావికాదళం శనివారం విజయవంతంగా ప్రయోగించి, పరీక్షించింది. కచ్చితమైన రీతిలో క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని నేవీ ట్వీట్ చేసింది. అభివృద్ధి చేసిన అధునాతన వర్షన్ అయిన ఈ క్షిపణి దీర్ఘశ్రేణి లక్ష్య దాడి సామర్ధ్యాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు ఆ ట్వీట్ పేర్కొంది. లక్ష్యాన్ని కచ్చితంగా విధ్వంసం చేసిన తీరు చూస్తుంటే ఫ్రంట్‌లైన్ వేదికలపై దీన్ని ఉపయోగించడానికి పూర్తి సన్నద్ధంగా వున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. యుద్ధనౌక నుండి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు వీడియో విజువల్స్ కనిపిస్తున్నాయి. అధిక వేగంతో ప్రయోగ వేదిక నుండి దూసుకువచ్చిన ఈ క్షిపణి క్రమంగా సముద్రంపై యూ టర్న్‌లో తన దిశను మార్చుకోవడం కనిపించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటైన బ్రహ్మోస్‌ను నేవీ క్రమం తప్పకుండా పరీక్షిస్తూ వుంటుంది.