Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీనాక్షి ముఖర్జీతో పాటు 16 మంది జైలులోనే
- పోలీసులు వేధిస్తున్నారు : డీవైఎఫ్ఐ
కోల్‌కతా : ప్రముఖ యువ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆప్ ఇండియా (డీవైఎఫ్ఐ) అధ్యక్షురాలు మీనాక్షి ముఖర్జీ సహా 16 మంది కార్యకర్తల కస్టడిని పొడిగించారు. యూత్ లీడర్ అనిస్ ఖాన్ హత్యకు నిరసనగా హౌరాలో చేపట్టిన మార్చ్‌లో చెలరేగిన హింసాత్మక ఆరోపణలపై డీవైఎఫ్ఐ కార్యకర్తలకు ప్రస్తుతం బెయిల్ నిరాకరణ జరుగుతున్నది. డీవైఎఫ్ నాయకులను జైలు కస్టడీ నుంచి విడుదల చేయాలంటూ సీనియర్ అడ్వకేటు బికాశ్ భట్టాచార్యా శుక్రవారం కోరారు. అయితే, హౌరా కోర్టు జిల్లా జడ్జి మాత్రం వారికి మరో మూడు రోజుల జైటు కస్టడీని విధించారు. దీంతో వారు కస్టడీలో ఉండనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర అసంతృప్తి చెలరేగుతున్నది. ఈ క్రమంలో నిరసనలు చేసిన మీనాక్షి ముఖర్జీతో పాటు 16 మందిపై తృణమూల్ ప్రభుత్వం హత్యాయత్నంతో పాటు ఇతర కేసులను బనాయించింది. మీనాక్షి ముఖర్జీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీపై సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే.
'కస్టోడియల్ టార్చర్'
అనిస్ ఖాన్ హత్య విషయంలో డీవైఎఫ్ఐ గతనెల 26న నిరసనను నిర్వహించింది. అయితే, ఈ ఆందోళనలో పోలీసులకు జరిగిన చిన్న గాయాన్ని కారణంగా పేర్కొంటూ డీవైఎఫ్ఐ నాయకురాలితో పాటు 16 మందిపై కేసు నమోదు చేశారు. అయితే, కస్టడీలో ఉన్న తమ నాయకులపై హౌరాలోని పచ్లా పోలీసు స్టేషన్ లాకప్‌లో 'కస్టోడియల్ టార్చర్' జరుగుతున్నదని డీవైఎఫ్ఐ ఆరోపించింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు పోలీసు కస్టడీలో ఉన్న తమను కొడుతున్నారని జైలులో ఉన్న డీవైఎఫ్ఐ నాయకులు వెల్లడించినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, హౌరా గ్రామీణ జిల్లా ఉన్నతాధికారి అయిన సౌమ్యా రారు.. అధికార టీఎంసీ ఎమ్మెల్యే భర్త కావడం గమనార్హం.