Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన జరుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను, హెల్పర్లను, ఆశా వర్కర్లను, సిఐటియు నేతలను అరెస్టు చేయడాన్ని అఖిల భారత అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమాఖ్య (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్) తీవ్రంగా ఖండించింది. వారిని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేయడాన్ని విమర్శించింది. పెండింగ్‌లో వున్న డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ సోమవారం అసెంబ్లీ మార్చ్‌కు వారు పిలుపిచ్చారు. కానీ ఆ ప్రదర్శన జరగనివ్వకుండా, ఆదివారం నుండే పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను, ఆశా వర్కర్లను అరెస్టు చేస్తూ, అణచివేత చర్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. వారు బుక్ చేసు కున్న వాహనాలను కేన్సిల్ చేయడం, ద్రైవర్లను బెదిరించడం, ఆర్టీసీ బస్సుల్లో ఎక్కకూడదంటూ ఒత్తిడి తీసుకురావడం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఆశా యూనియన్ అధ్యక్షుడు ఎ.టి.పద్మనాభన్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్ళారు. ఉదయం నుంచి ఎక్కడబడితే అక్కడ వందలాది వాహనాలను నిలిపివేశారు. వేలాది కార్యకర్తలను వేధింపులకు గురి చేశారు. హర్యానాలో జరిగిన రీతిలోనే ఇక్కడా అణచివేత చర్యలు చేపట్టారు.