Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. అయితే గతంలో కంటే అసెంబ్లీ స్థానాలు పెద్ద సంఖ్యలో తగ్గుతాయని పేర్కొన్నాయి. పంజాబ్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకొని ఆప్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అయితే ఉత్తరాఖండ్, గోవాలో ఫలితాలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చేట్టు లేదని ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు చెబుతున్నాయి. గోవాలో హంగ్ ఏర్పడే అవకాశముందని తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో ఓటర్లనాడిని పట్టుకోవడంలో విఫలమైన ఎగ్జిట్ పోల్స్, ఈసారి వెలువరించిన ఫలితాలపైనా అనుమానాలున్నాయని, యూపీలో అఖిలేశ్ యాదవ్ గెలుపు అవకాశాల్ని ఇప్పుడే తీసిపారేయలేమని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో మార్చి 10న రానున్న ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎన్ఎన్ న్యూస్ 18, రిపబ్లిక్ టీవీ, న్యూస్ ఎక్స్ ఛానల్స్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో యూపీలో బీజేపీకి 211-277 స్థానాలు రావొచ్చని తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షంగా సమాజ్‌వాదీ పార్టీకి 119-160 స్థానాల మధ్య వస్తాయని పేర్కొన్నాయి. బీజేపీ 225 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-వీటో పోల్, ఎస్పీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 151 స్థానాలు బీఎస్పీకి 14స్థానాలు వస్తాయని పేర్కొన్నది. యూపీలో బీజేపీ-సమాజ్‌వాదీ మధ్య నువ్వా-నేనా అన్నట్టు పోటీ ఉంటుందని ఏబీపీ సీ-వోటర్ అంచనా వేసింది. పంజాబ్‌లో ఆప్‌కు 50-61 స్థానాలు, కాంగ్రెస్‌కు 28-32స్థానాలు వస్తాయని, ఉత్తరాఖండ్, గోవాలలో హంగ్ రావొచ్చని తెలిపింది. టుడేస్ ఛాణక్య ఉత్తరాఖండ్‌లో బీజేపీకి 43స్థానాలు, కాంగ్రెస్‌కు 24, ఇతరులకు 3స్థానాలు వస్తాయని, జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ బీజేపీకి 32-41, కాంగ్రెస్‌కు 27-35, ఆప్‌కు ఒకటి, బీఎస్పీకి 3 స్థానాలు వస్తాయని అంచనావేసింది. టైమ్స్ నౌ వీటో..ఉత్తరాఖండ్‌లో బీజేపీకి 37, కాంగ్రెస్‌కు 31 వస్తాయని తెలిపింది. ఇండియా టుడే బీజేపీకి 36-46, కాంగ్రెస్‌కు 20-30 వస్తాయని పేర్కొన్నది. యూపీలో అఖిలేశ్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ విజయం సాధిస్తుందని ఆత్మసాక్షి తన ఎగ్జిట్‌పోల్‌లో ప్రకటించటం సంచలనం రేపుతోంది. స్వల్ప ఆధిక్యతతో బీజేపీ అధికారం దక్కించుకు ంటుందని టైమ్స్ నౌ, పీపుల్స్ పల్స్, పి-మార్క్, మ్యాట్రిజ్..ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి.
యూపీ(403), పంజాబ్(117), ఉత్తరాఖండ్(70), గోవా(40), మణిపూర్(60)..ఐదు రాష్ట్రాల్లో మొత్తం 690 శాసనసభ నియోజికవర్గాలకు ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు సోమవారం ముగిశాయి. ఫిబ్రవరి 10న మొదలైన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం మొత్తం ఏడు విడతల్లో కొనసాగింది. ఈ ఎన్నికలు 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న తరుణంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న చర్చ సాగుతోంది.
ఉత్తరప్రదేశ్ (మొత్తం స్థానాలు 403)
ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్ : సమాజ్‌వాదీ : 235-240, బీజేపీ : 138-140, బీఎస్సీ : 19-23, కాంగ్రెస్ : 12-16, ఇతరులు 1-2.
పోల్ స్ట్రాట్ : బీజేపీ : 211-255, సమాజ్‌వాదీ : 146-160, బీఎస్పీ: 14-24, కాంగ్రెస్ : 4-6
టైమ్స్ నౌ : బీజేపీ-225, సమాజ్‌వాదీ-151, కాంగ్రెస్-9, బీఎస్పీ-14
పీపుల్స్ పల్స్ : బీజేపీ:220-240, సమాజ్‌వాదీ:140-160, కాంగ్రెస్ : 6-10, బీఎస్పీ : 12-18
పంజాబ్ (117)
ఇండియాటుడే : ఆప్ : 1-4, కాంగ్రెస్: 19-31, అకాళీదళ్:7-11, బీజేపీ:1-4
ఉత్తరాఖండ్ (70)
టైమ్స్ నౌ : బీజేపీ-37, కాంగ్రెస్-31, ఆప్-1, ఇతరులు-1
రిపబ్లిక్ టీవీ : బీజేపీ : 35-39, కాంగ్రెస్:28-34, ఆప్-3, ఇతరులు-3