Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూణె పోలీసుల నిర్వాకం
పూణె : నల్లని మాస్కులు, సాక్సులు ధరించి ప్రధాని కార్యక్రమానికి హాజరు కాకూడదంటూ పోలీసులు ఆదేశించిన ఘటన పూణెలో సోమవారం జరిగింది. చివరికి నలుపు చొక్కాలను కూడా తొలగించాల్సిందేనంటూ పట్టుబట్టారు. వివరాల్లోకి వెళితే.. ప్రధాని మోడీ సోమవారం పూణెలో ఒక రోజు పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఐటీ కాలేజీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్రోరైలు, ఛత్రపతి శివాజీ విగ్రహం, ప్రముఖ కార్టూనిస్ట్ అంకితమిస్తూ ప్రత్యేక గ్యాలరీని ప్రారంభించారు. అలాగే సింబయాసిస్ యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎక్కడా నిరసన ప్రదర్శనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లుచేయాలంటూ పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా ఆదేశించారు. దీంతో నల్లని మాస్కులు, సాక్సులు, చివరికి చొక్కాలు ధరించిన వారిని కూడా కాలేజీలోకి అనుమతించలేదు. దీనిపై జర్నలిస్ట్ మంగేష్ ఫాల్లే మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన తనను నల్లని మాస్క్ ధరించావంటూ లోపలికి అనుమతించలేదని అన్నారు. కాగా, ప్రధాని పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్, ఎన్సిపిలు ఆందోళన చేపట్టాయి. అల్కా టాకీస్ చౌక్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గో బ్యాక్ మోడీ అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఇతర రాష్ట్రాలకు కరోనా వ్యాప్తి చెందేలా ఆ రాష్ట్రం ప్రోత్సహిస్తోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రను అవమానపరిచారంటూ ఆయా పార్టీల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.