Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూపీలో ఓటు వేసిన విద్యార్థిని
వారణాసి : యుద్ధ ప్రాంతమైన ఉక్రెయిన్ నుండి భారత్‌కు వచ్చిన విద్యార్థిని కతిక సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉక్రెయిన్ నుంచి తరలించిన భారతీయ విద్యార్థులలో ఈమె కూడా ఒకరు. ఉక్రెయిన్ నుండి శనివారం తన స్వస్థలమైన యుపిలోని వారణాసికి చేరుకున్నారు. అటువంటి భయానక పరిస్థితుల నుండి పూర్తిగా బయటపడకపోయినప్పటికీ.. యుపి అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో వారణాసిలోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఓటు హక్కుని వినియోగించుకోవడం తన బాధ్యత అని కతిక అన్నారు. ఖార్కివ్‌లో చిక్కుకుపోయిన మిగిలిన విద్యార్థులతో పాటు తాను పోలాండ్ సరిహద్దుకు చేరుకున్నామని, అప్పటివరకు తమకు ఎవరూ సహాయం అందించలేదని అన్నారు. సరిహద్దు పాయింట్‌కు చేరుకున్న అనంతరం భారతీయ దౌత్య కార్యాలయ అధికారులు సహాయం అందించారని చెప్పారు. భారత్‌లో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు అవకాశం లేదని అన్నారు. ఇక్కడ తమ చదువుని కొనసాగించేందుకు ప్రధాని మోడీ అనుమతిస్తే ఇక్కడే ఉంటామని.. లేకుంటే మెడిసిన్ పూర్తి చేసేందుకు ఉక్రెయిన్ వెళతానని అన్నారు. అవసరమైన ఏర్పాట్లు చేస్తే.. యుపిలోని వారణాసితో పాటు అజమ్గఢ్, మౌ, జాన్పూర్, ఘాజీపూర్, చందౌలి, మీర్జాపూర్, భదోహి, సోన్భద్రలలో చివరిదశ పోలింగ్ జరిగింది.