Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఫీచర్ ఫోన్‌తోనూ ఇకపై నగదు చెల్లింపులు చేయవచ్చు. ఇందుకోసం రూపొందించిన 'యూపీఐ123పే' సర్వీసులను మంగళవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ లాంచనంగా ప్రారంభించారు. ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపొచ్చని ఆర్బీఐ తెలిపింది. దీంతో దేశంలోని 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులు కూడా నగదు చెల్లింపులు చేసుకోవడానికి సదుపాయం కల్పించినట్లయ్యిందని పేర్కొంది. బ్యాంక్ ఖాతాతో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌తో మాత్రమే లావాదేవీలు జరపడానికి వీలుంది. నగదు బదిలీ, నిల్వ మొత్తం తెలుసుకోవచ్చు. ఈ సర్వీసులు 12 భాషల్లో లభించనున్నాయి. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి 14431 లేదా 18008913333 ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్ల ద్వారా ఈ సేవలను పొందవచ్చు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ యూపీఐ సేవలు భారీగా పెరగడానికి అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది.