Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో పెట్రో వాత
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరను మంగళవారం కేంద్ర ప్రభుత్వం పెంచింది. క్రూడ్ ఆయిల్ విషయంపై అంతర్జాతీయ ధరలపై మరికొన్ని రోజులు పరిశీలించి, మరింత స్పష్టత రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను త్వరలోనే పెంచనున్నట్లు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థల అధికారులు తెలిపారు. సీఎన్జీ ధరను కేజికి రూ 0.50 పైసలు మంగళవారం పెంచారు. ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ.56.51 పైసలు నుంచి రూ.57.51 పైసలకు పెరిగింది. తాజా పెంపుతో ఈ ఏడాదిలోనే సిఎన్జి ధర కేజికి రూ.4 పెరిగింది. స్థానిక పన్నులను అనుసరించి రాష్ట్రానికీ రాష్ట్రానికీ మధ్య సీఎన్జీ ధరలో తేడాలుంటాయి. ముంబయిలో కేజీ సీఎన్జీ ధర రూ.66గా ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల నుంచి పెట్రో ధరలను పెంచలేదు. పోలింగ్ ప్రక్రియ ముగియడం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరగడంతో భారీగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేందుకు మోడీ సర్కార్ సిద్ధమయింది.