Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు కుంభకోణం కార్పొరేషన్ దళపతిగా..
కుంభకోణం : జనంతో పరిచయాలు.. మంచితనం ఉంటే...పార్టీలు టికెట్ ఇస్తే తీసిపోమని నిరూపిస్తున్నారు. తాజాగా ఓ ఆటోడ్రైవరే మేయర్ అయ్యారు. తమిళనాడు.. తంజావూర్ జిల్లాలోని కుంభకోణం కార్పొరేషన్‌కు మొదటి మేయర్‌గా 42 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ కె శరవణన్ బాధ్యతలు స్వీకరించారు. తాను ఇప్పటికీ ప్రజల్లో ఒకడినే అనే సందేశాన్ని అండర్లైన్ చేయాలని కోరుతూ, శరవణన్ తన ఆటోరిక్షా నడుపుకుంటూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు.రాష్ట్రంలోని అధికార డీఎంకెే పార్టీ 21 కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థులను అభ్యర్థులను ప్రతిపాదించింది, ఒక మేయర్ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించింది. ఈ పదవి కోసం చాలా మంది సీనియర్ పార్టీ కార్యకర్తల్లో ఒకరికి వస్తుందని భావించినప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ శరవణన్‌ను మేయర్ పదవికి ఎంపిక చేసింది.ఇటీవల కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన కుంభకోణం మొదటి మేయర్ కూడా శరవణన్. ఆలయ నగరంలోని 17వ వార్డులో జరిగిన పోలింగ్‌లో మొత్తం 2,100 ఓట్లకు గాను 964 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కె శరవణన్
శరవణన్‌ను అభినందనలతో ముంచెత్తారు. నిరాడంబరమైన నేపథ్యం నుంచి అభ్యర్థిని ఎంచుకున్నందుకు పార్టీ నాయకత్వాన్ని పలువురు అభినందించారు.తనను ఉన్నత పదవికి నామినేట్ చేసినట్టు పార్టీ తెలియజేసినప్పుడు షాక్ గురయ్యానని శరవణన్ తెలిపారు.''నేను కేవలం ఆటోడ్రైవర్నేనని, కానీ నాకు మేయర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని, పార్టీ నన్ను అన్ని విధాలా ఆదుకుంటుందని శరవరణ్ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నుంచి నాకు కాల్ వచ్చింది, నేను నిజంగా బతుకుదెరువు కోసం ఆటోరిక్షా నడిపానా అని అడిగారు. దానికి నేను అవును అని చెప్పాను. నాకు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో కుంభకోణాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. నా నామినేషన్ పట్ల రాహుల్ జీ ( రాహుల్ గాంధీ ) కూడా సంతోషంగా ఉన్నారని మా నాయకులు చెప్పారు , ''అన్నారాయన.పదోతరగతి వరకు చదివిన శరవణన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకుని తాతయ్యల దగ్గర పెరిగాడు. అతని తాత కుమారసామి 1976లో కుంభకోణం మునిసిపాలిటీ సభ్యునిగా పనిచేశారు. అతని తాత స్ఫూర్తితో, శరవణన్ 2002లో కాంగ్రెస్‌లో చేరారు . వెంటనే వార్డు లీడర్‌గా,ఆ తరువాత పార్టీ తరఫున కుంభకోణం యూనిట్ వైస్ ప్రెసిడెంట్‌గా నామినేట్ అయ్యారు.
ఎంకే స్టాలిన్‌తో కె శరవణన్
శరవణన్ తన భార్య దేవి, ముగ్గురు పిల్లలతో కలిసి తుక్కంపాళయంలో అద్దె ఇంట్లో ఉంటూ రెండు దశాబ్దాలుగా ఆటోరిక్షా నడుపుతున్నాడు. కుంభకోణంలోని ప్రతి సందు తనకు తెలుసనీ, దీంతో నగరంలోని మొత్తం 48 వార్డులకు చెందిన వారితో పరిచయం ఏర్పడిందన్నారు. ఏడేండ్ల కిందట సొంతంగా ఆటోరిక్షా కొని దానిపై ఆధారపడి జీవిస్తున్నానని తెలిపారు..అనేక మంది మాదిరిగానే, మహమ్మారి తన ఆదాయానికి తీవ్ర దెబ్బ తగిలింది శరవణన్ వార్డు సభ్యుల సహాయంతో మాత్రమే కౌన్సిలర్ పదవికి తన నామినేషన్ దాఖలు చేయగలిగానని వివరించాడు..