Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.16,890కోట్ల రుణాలు సేకరించిన 8 రాష్ట్రాలు
న్యూఢిల్లీ : దేశంలో అనేక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆగమాగం ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం, ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అనేక రాష్ట్రాల ఖజానా చాలా వేగంగా ఖాళీ అవుతోంది. దాంతో అధిక వడ్డీ, కాలపరిమితితో కూడిన బాండ్లు, సెక్యూరిటీస్ ద్వారా రుణాలు సేకరించాల్సిన పరిస్థితి రాష్ట్రాలకు ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం జరిగిన రుణాల సేకరణలో 10 బేసిస్ పాయింట్స్ పెంచి..రుణాలు సేకరించాల్సి వచ్చిందని తెలిసింది. మార్చా 8న జరిగిన బాండ్స్, సెక్యూరిటీస్ అమ్మకాల్లో పదేండ్ల గడువున్న రుణాలపై 7.25శాతం వడ్డీని చెల్లించడానికి రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. తాజాగా 8రాష్ట్రాలు బహిరంగ మార్కెట్లో రుణాలు సేకరించాయి. మంగళవారం జరిగిన బాండ్లు, సెక్యూరిటీస్ వేలంపాటలో ఆయా రాష్ట్రాలకు రూ.16,890కోట్లు దక్కాయి. రాష్ట్రాలు చేసే ఈ తరహా రుణాల్ని 'అభివృద్ధి రుణాలు' (ఎస్డీఎల్)గా పేర్కొంటారు. ఈమధ్యకాలంలో 10ఏండ్ల కాలపరిమితి కలిగిన ఎస్డీఎల్ అమ్మకాలు పెద్ద ఎత్తున పెరిగాయి. గుజరాత్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు అత్యధిక సంఖ్యలో 10ఏండ్ల ఎస్డీఎల్ జారీ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం జనవరి-మార్చి 2022లో పలు రాష్ట్రాలు రూ.1.7లక్షల కోట్ల రుణాలు బహిరంగ మార్కెట్లో సేకరించాయి. ''గత కొంతకాలంగా ఎస్డీఎల్, కేంద్ర సెక్యూరిటీస్ మధ్య అంతరం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా సంక్షోభం, ముడి చమురు ధరలు పెరగటం..అధిక వడ్డీ, కాల పరిమితితో ప్రస్తుతం రుణ సేకరణకు దారితీసింది. గత వారంలో జరిగిన రుణ సేకరణద్వారా బేసిస్ పాయింట్స్ 39 నుంచి 36కు పడిపోయాయి.
ఇది మరింత పడిపోతుందని ప్రస్తుతానికి భావించటం లేదు'' అని పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ హెడ్ పునీత్ పాల్ చెప్పారు.