Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగనుంది. ఎన్నికలు జరిగిన యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాలు నాలుగు ఉండగా, కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంది. యూపీలో సమాజ్‌వాది పార్టీ నుంచి బీజేపీకి గట్టి సవాల్ ఎదురుకాగా, పంజాబ్‌లో ఆప్ నుంచి కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి.
మిగతా వాటిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ కేంద్రీకృతమైంది. మార్చి7న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ యూపీ, మణిపూర్‌లో బీజేపీ, పంజాబ్‌లో ఆమాద్మీ పార్టీ, ఉత్తరాఖండ్, గోవాల్లో హంగ్ వచ్చే అవకాశమున్నట్టు అంచనా వేశాయి.