Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : తమిళనాడులో ఓ మంత్రి కుమార్తె ప్రేమ వివాహం చర్చనీ యాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు మంత్రి పి.కె శేఖరబాబు కుమార్తె జయ కల్యాణి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె సతీశ్‌కుమార్ అనే వ్యాపారవేత్తతో పరిచయమైంది. కొద్దిరోజులకే పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి అంగీకరించలేదు. దీంతో ఈ జంట ఇంటినుంచి వెళ్లిపోయి కర్ణాటకలోని ఓ మఠంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారి పెళ్లి వీడియోను మీడియాకు విడుదల చేశారు. మరోవైపు తన కుమార్తె కనిపించడం లేదని, కొందరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారని మంత్రి శేఖర్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ జంట బెంగళూరు పోలీసులను ఆశ్రయించి.. తమిళనాడు పోలీసులు తమకు సహకరించడం లేదని.. తన తండ్రి బెదిరిస్తున్నారని జయకల్యాణి ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రుల నుంచి వారికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పోలీసులకు తెలపడంతో.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.