Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయని పక్షంలో కుల వివక్ష లేని సమాజం సుదూర కలగానే మిగిలిపోతుం దని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. క్రిమినల్ ప్రొసీడింగ్ల రద్దును పరిగణనలోకి తీసుకునేటప్పుడు, సమాజంలోని బలహీన వర్గాలు బలవంతానికి గురయ్యే దుర్బలత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ) చట్టం వంటి ప్రత్యేక చట్టాల కింద క్రిమినల్ ప్రొసీడింగ్లను రద్దు చేయడంలో న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. రాజీ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఎఫ్ఐఆర్)లను రద్దు చేసేందుకు జస్టిస్ చంద్రధరి సింగ్ నిరాకరించారు.''చట్టంలోని నిబంధనలు వాటి నిజమైన అక్షరం, స్ఫూర్తితో అమలు జరగకపోతే, చట్టంలో శాసనపరమైన ఉద్దేశ్యం స్పష్టంగా కనిపించకపోతే, కుల ఆధారిత వివక్ష లేని సమాజం దృక్పథం సుదూర కలగా మిగిలిపోతుంది'' అని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఫిర్యాదుదారునితో రాజీ కుదుర్చుకున్నారని, ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం ద్వారా ఎస్సి, ఎస్టి చట్టాన్ని పలుచన చేయలేయమని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.