Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో వినూత్నంగా..
తిరువనంతపురం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం కేరళ మహిళా శిశు సంక్షేమ శాఖ నైట్ వాక్ నిర్వహించింది. కనకకున్ను నుంచి ఈస్ట్ పోర్ట్‌లోని ఉన్న గాంధీ పార్క్ వరకు ఈ వాక్.. మహిళల కోసమే అని చాటిచెప్పేందుకు బహిరంగ ప్రదేశాల్లో చేపట్టారు. నైట్ షాపింగ్ కూడా నిర్వహించారు. ఈ నైట్ వాక్కు రాష్ట్ర హౌం మంత్రి వీణా జార్జ్ నాయకత్వం వహించారు. బహిరంగ ప్రదేశాలు మహిళా హక్కులుగా వీణా పేర్కొన్నారు. 'మహిళలు రాత్రి పూట ప్రయాణం చేయలేని పరిస్థితులు మారాలి. పని ముగించుకుని రాత్రి నివాసాలకు వెళ్లే మహిళలు, యువతులకు స్వేచ్ఛ ఉండాలి. ఇది సమాజం బాధ్యత. ఈ నైట్ వాక్ ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి' వీణా వ్యాఖ్యానించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ టివి అనుపమ, తిరువనంతపురం జిల్లా కలెక్టర్ డా. నవజ్యోత్ ఖోసా, మరికొంద మహిళలు ఈ నైట్‌వాక్‌లో పాల్గొన్నారు.