Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మిగులు భూములు, భవనాలు బేరానికే..
- ప్రభుత్వ భూముల అమ్మకానికి కార్పొరేషన్(ఎన్ఎల్ఎంసీ)
- మోడీ క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ భూములను మోడీ సర్కార్ బేరానికి పెట్టబోతోంది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్(ఎన్ఎల్ఎంసీ)ను ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది. మిగులు భూమి నగదీకరణ (సర్ప్లస్ ల్యాండ్ మానిటైజేషన్) చేపట్టేందుకు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ)ను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. రూ.5 వేల కోట్ల ప్రారంభ ఆధీకృత షేర్ క్యాపిటల్, రూ.150 కోట్ల పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్‌తో కేంద్ర ప్రభుత్వ పూర్తి యాజమాన్య సంస్థగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ ప్రభుత్వ పూర్తి యాజమాన్య సంస్థగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ)ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల్లోనూ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల్లోనూ మిగులు భూమి, భవనాల ఆస్తులను ఎన్ఎల్ఎంసీ మోనటైజేషన్ చేస్తుంది. ఈ ప్రతిపాదన 2021-22 బడ్జెట్ ప్రకటనకనుగుణంగా తీసుకున్నట్టు మంత్రివర్గం తెలిపింది. నాన్-కోర్ ఆస్తులను మానిటైజేషన్ చేయడంతో ప్రభుత్వం ఉపయోగించని ఆస్తులను మానిటైజ్ చేయడం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందగలుగుతుందని తెలిపింది.
ప్రయివేట్ రంగ పెట్టుబడులను ప్రేరేపించడం కోసమే..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భూమి, భవనాల వంటవి గణనీయమైన మిగులు, ఉపయోగించని నాన్-కోర్ ఆస్తులను కలిగి ఉన్నాయి. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, మూసివేతకు లోనవుతున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మిగులు భూమి, నాన్-కోర్ ఆస్తులను మానిటైజేషన్ చేయడంలో ముఖ్యమైనది ఆయా సంస్థల విలువను అన్‌లాక్ చేయడమని పేర్కొంది.
సీపీఎస్ఈల మూసివేత, పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం
ఎన్ఎల్ఎంసీ సీపీఎస్ఈల మూసివేత ప్రక్రియను వేగవంతం చేస్తుందని, ప్రభుత్వ యాజమాన్యంలోని సీపీఎస్ఈల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేస్తుందని మంత్రివర్గం తెలిపింది. మూసివేయబడిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ)ల్లో మిగులు భూమి, బిల్డింగ్ ఆస్తులు, వ్యూహాత్మక ఉపసంహరణ కింద ప్రభుత్వ యాజమాన్యంలోని సీపీఎస్ఈల మిగులు నాన్-కోర్ ల్యాండ్ ఆస్తులను స్వంతం చేసుకోవడం, నిర్వహించడం, నగదు ఆర్జించడం కూడా ఎన్ఎల్ఎంసీ చేస్తుందని పేర్కొంది. ఈ ఆస్తులను ఎన్ఎల్ఎంసీకి బదిలీ అవుతాయని తెలిపింది. ఎన్ఎల్ఎంసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కంపెనీ వృత్తిపరమైన కార్యకలాపాలు, నిర్వహణను ప్రారంభించడానికి సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రముఖ నిపుణులను కలిగి ఉంటారు. ఎన్ఎల్ఎంసీ ఛైర్మెన్, ప్రభుత్వేతర డైరెక్టర్లు మెరిట్ ఆధారిత ఎంపిక ప్రక్రియ ద్వారా నియామకం జరుగుతుందని తెలిపింది.
ప్రయివేట్ రంగానికి చెందిన నిపుణుల నియామకం
రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిశోధన, న్యాయపరమైన శ్రద్ధ, వాల్యుయేషన్, మాస్టర్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ల్యాండ్ మేనేజ్మెంట్ మొదలైన వాటిలో అసెట్ మానిటైజేషన్ (ఆస్తుల అమ్మకం)కు అవసరమైన విస్తృత నైపుణ్యాల కోసం నిపుణులను నియమిస్తామని తెలిపింది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్), ఇన్వెస్ట్ ఇండియా వంటి ఇతర ప్రత్యేక ప్రభుత్వ కంపెనీల మాదిరిగానే ప్రయివేట్ రంగానికి చెందిన నిపుణులను నియమించుకోవాలని నిర్ణయించినట్లు మంత్రివర్గం తెలిపింది. ఎన్ఎల్ఎంసీ కనీస పూర్తి సమయం సిబ్బందితో ఒక లీన్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మార్కెట్ నుంచి నేరుగా నియమించబడుతుందని, ప్రయివేట్ రంగం నుంచి అనుభవజ్ఞులైన నిపుణులను నియమించుకో వడానికి, చెల్లించడానికి, నిలుపుకోవడానికి ఎన్ఎల్ఎంసీ బోర్డ్‌కు సౌలభ్యం అందించబడుతుందని పేర్కొంది.
గుజరాత్లో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఏర్పాటు
గుజరాత్‌లోని జామ్ నగర్లో డబ్ల్యుహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (డబ్ల్యూహెచ్ఓ జీసీటీఎం) ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది.
ఖనిజాల రాయల్లీ రేటు చట్ట సవరణకు ఆమోదం
కొన్ని ఖనిజాలకు సంబంధించి రాయల్టీ రేటును సవరించేందుకు అవకాశం కల్పించే విధంగా గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం- 1957 రెండో షెడ్యూల్‌ను సవరణలు చేయాలన్న ఖనిజ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.