Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో అరుదైన రికార్డు
- రాంపూర్ ఖాస్‌లో కాంగ్రెస్ విజయం పరంపర
న్యూఢిల్లీ : ఒకసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా 40 ఏళ్లగా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తునే వస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్నప్పటికీ, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంది. అదే ఉత్తరప్రదేశ్‌లో రాంపూర్ ఖాస్ నియోజకవర్గం. ఉత్తరప్రదేశ్ అరుదైన రికార్డు నమోదు అయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు, సీట్లు కోల్పోయినప్పటికీ, రాంపూర్ ఖాస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆరాధనా మిశ్రా, తన సమీప బిజెపి అభ్యర్థి నాగేష్ ప్రతాప్ సింగ్‌పై దాదాపు 15 వేల ఓట్లుకు పైగా ఆధిక్యంతో గెలిపొందారు. ఈ నియోజకవర్గంలో 1980లో మొదటి సారి ఆరాధన మిశ్రా తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ గెలిపొందారు. అప్పటి నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. 1980, 85, 89, 91, 93, 96, 2002, 2007, 2012 ఎన్నికల్లో విరామం లేకుండా గెలుస్తూనే ఉన్నారు. 2013లో ఆయన రాజ్యసభకు ఎన్నికవ్వడంతో రాంపూర్ ఖాస్ నియోజవర్గ అసెంబ్లీ స్థానం ఖాళీ ఏర్పాడింది. 2014లో ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ఆరాధన మిశ్రా పోటీలో దిగారు. ఆమె ఘన విజయం సాధించారు. ఆ తరువాత 2017లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆరాధన మిశ్రా గెలిపొందారు. ఇప్పుడు 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని మట్టికరిపించారు.