Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు!
- స్వల్ప ఓట్ల తేడాతో సీఎం ప్రమోద్ సావంత్ విజయం
- కాంగ్రెస్ను ఓడించిన టిఎంసి
న్యూఢిల్లీ : గోవాలో ఏ పార్టీకీ, కుటమికీ పూర్తి స్థాయి మెజార్టీ మెజార్టీ రాలేదు. అయితే అధికార బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని ముందంజలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్కస్థానం తక్కువ కావటంతో బీజేపీ ఎవరితో చేతులు కలుపుతుంద న్నది ఇంకా తెలియాల్సి వుంది. 40 స్థానాల్లో బీజేపీ 20 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 11, ఆ పార్టీ కూటమి..గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పి) 1 స్థానాన్ని గెలుచుకుంది. తృణముల్ కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) 2 స్థానాలను గెలుచుకుంది. ఆప్ రెండు స్థానాలను,రివల్యూషనరీ గోన్స్ పార్టీ-1, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిపొందారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21స్థానాల్లో గెలవాల్సి ఉంది.కానీ బీజేపీ 20స్థానాల్లోనే గెలిచిం ది. దాంతో ఎంజీపీ,స్వతంత్రులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధపడింది. గతంలో కంటే ఇప్పుడు బీజేపీ ఏడు స్థానాలు ఎక్కువ గెలుచుకో గా,కాంగ్రెస్ ఆరో స్థానాలను కోల్పోయింది. జీఎఫ్జీ రెండు, ఎంజీపీ ఒక స్థానాన్ని కోల్పోయాయి.గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అతికష్టం మీద గట్టెక్కారు. సాంక్వెలిమ్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రమోద్ సావంత్ తొలి రౌండ్ నుంచి వెనుకంజలో ఉన్నారు. కేవలం 666 ఓట్లతో గెలిపొందారు.
కాంగ్రెస్ను ఓడించిన టీఎంసీ
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తృణముల్ కాంగ్రెస్ ప్రధాన కారణంగా కూడా కనబడుతుంది. ఎన్నికల ఫలితాలు చూస్తే కాంగ్రెస్ను టీఎంసీ ఓడించిందని స్పష్టం అవుతోంది. గోవా ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీఎంసీ, కాంగ్రెస్ ఓట్లను భారీగా చిల్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు పది స్థానాల్లో ఓట్లు చీలడం వల్లే కాంగ్రెస్ ఓటమి చెందింది. అలా జరిగి ఉండకపోతే గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది. అలాగే ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు 500, 1000 ఓట్ల మెజార్టీతోనే గెలిపొందారు.