Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి విజయాన్ని సాధించింది. మతపరమైన సమీకరణలను ఉధృతం చేయడం, మీడియాలో అతిపెద్ద సెక్షన్‌ని నియంత్రించడం, పెద్దయెత్తున డబ్బు కుమ్మరించడం ద్వారా బీజేపీ మెజారిటీ తగ్గినా ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుందని సీపీఐ(ఎం) వ్యాఖ్యానించింది. పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం నాడు ఈ మేరకు ఇక్కడ ఒక ప్రకటన విడుదలజేసింది. అంతులేని ఆర్థిక కడగండ్లు ఎదుర్కొన్న ప్రజలకు ఉచితంగా తిండిగింజలు అందజేయడం వంటి సహాయక చర్యలు ఈ ఫలితాలపై ప్రభావాన్ని కనబరిచాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపొందింది. పంజాబ్‌లో ఆమాద్మీ పార్టీ ఊడ్చేసింది. పంజాబ్ ప్రజలు కాంగ్రెస్, అకాలీదళ్ రెండు సాంప్రదాయ పార్టీలను తిరస్కరించి, నిర్ణయాత్మక మార్పు కోసం ఓటు చేశారు. మొత్తమ్మీద ఈ ఫలితాలు మితవాద రాజకీయాల ఆధిపత్యం కొనసాగుతున్నదని సూచిస్తున్నాయి. హిందూత్వ - కార్పొరేట్ వ్యవస్థకు, వాటి విధానాలకు, పెరుగుతున్న నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు తాజా వ్యూహాలను రూపొందించుకుని, రెట్టించిన పట్టుదలతో తమ యత్నాలను ముమ్మరం చేయాలని పొలిట్‌బ్యూరో కోరింది.