Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 242 మంది భారతీయులు
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపడుతున్న తరలింపు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో సుమీలో చిక్కుకుపోయిన 242 మంది భారతీయులను పోలాండ్ మీదుగా శుక్రవారం ఉదయం ఢిల్లీకి తీసుకువచ్చారు. పోలండ్‌లోని ర్జెస్జో నుండి గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో బయల్దేరిన విమానం శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఢిల్లీకి చేరుకుందని అధికారులు తెలిపారు. సుమీలో చిక్కుకున్న 600 మంది పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం.. పోలాండ్‌కు మూడు విమానాలను పంపింది. మరో రెండు విమానాలు కూడా శుక్రవారమే భారత్‌ను చేరుకునే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్‌లో సుమీలో తాము చిక్కుకుపోయామని, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాతే తరలింపు ప్రక్రియ సజావుగా సాగినట్లు అక్కడి నుండి వచ్చిన పలువురు పౌరులు చెబుతున్నారు.