Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అహ్మద్ మృతికి సీఐటీయూ నివాళి
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రఖ్యాత మార్క్సిస్ట్ తత్వవేత్త, రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ ఐజాజ్ అహ్మద్ మృతి పట్ల సీఐటీయూ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్ అని పేర్కొంది. మార్క్సిస్ట్ సిద్ధాంతానికి కాలం చెల్లిందని సామ్రాజ్యవాద శక్తులు ప్రచారం చేస్తున్న తరుణంలో మార్క్సిస్ట్ విశ్లేషణను విస్తరించడంలో, దాన్ని పరిరక్షించడంలో ఐజాజ్ అహ్మద్ ప్రముఖ పాత్ర పోషించారని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటనలో కొనియాడారు. సంఘటిత కార్మికోద్యమం నాయకత్వంలోనే భారతీయ సమాజంలోని ఫాసిస్ట్ ధోరణులను ఓడించగలమని ఐజాజ్ చెప్పేవారని పేర్కొన్నారు. సీఐటీయూ భావసారూప్య సంఘాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవని తెలిపారు. ఆయన మరణించడం ప్రగతిశీల ఉద్యమానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహచరులకు సీఐటీయూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని పేర్కొన్నారు.