Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : ఉత్తర కాశ్మీర్‌లోని బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్ వద్ద ఆర్మీకి చెందిన హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)కి సమీపంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) సిబ్బందిని తీసుకువచ్చేందుకు ఆర్మీకి చెందిన చిరుత హెలికాప్టర్ ఎల్ఓసీ సమీపంలోని బందిపొరా జిల్లాకు వెళ్లినట్టు వివరించారు. ల్యాండ్ అవుతున్న సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయనీ, దీంతో ఒక్కసారిగా కుప్పకూలిందని అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు.