Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయం సాధించగా.. దీనిపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. తనకు మద్దతునిచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బిజెపి సీట్ల సంఖ్య తగ్గించి.. వ్యతిరేకత వ్యక్తపరిచారని అన్నారు. 'గతంతో పోలిస్తే తాజాగా సాధించిన సీట్ల సంఖ్యను రెండున్నర రెట్లు పెంచారు.ఓట్ల వాటాలో ఒకటిన్నర రెట్లు పెరిగినందుకు కతజ్ఞతలు' అని ఓటర్లనుద్ధేశించి అఖిలేష్ శుక్రవారం ట్వీట్ చేశారు. అదే సమయంలో బీజేపీ సీట్లు కూడా తగ్గాయని, ఈ క్షీణత కొనసాగుతుందని అన్నారు. సగానికి పైగా అపోహలు తొలగిపోయాయని, మిగిలినవి తొ¸లగిపోతాయని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని అన్నారు. యుపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 273 స్థానాలు గెలుపొందగా.. 2017లో గెలిచిన వాటిలో 49 స్థానాలను ఇప్పుడు కోల్పోయింది. అఖిలేష్ యాదవ్ 111 స్థానాల్లో విజయం సాధించగా.. ఈ కూటమి మొత్తం 125 సీట్లలో గెలుపొంది. గత ఎన్నికల కన్నా 73 సీట్లు అదనంగా గెలుచుకుంది.