Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ : ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో రెండు రోజులు పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌కు చేరుకున్న ఆయన గాంధీనగర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇటీవల విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో కమలదళాలు హంగామా చేస్తున్నాయి. వచ్చే ఏడాది గుజరాత్ ఎన్నికల దృష్ట్యా మోడీ.. ఇప్పుటి నుంచి ఫోకస్ చేస్తున్నారు. విమానాశ్రయం నుండి గాంధీనగర్‌లోని బిజెపి కార్యాలయం శ్రీ కమలం వరకు రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్‌లో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ కూడా ఉన్నారు. కాగా, అంతకముందు ప్రధాని మోడీ గుజరాత్ పర్యటన గురించి తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పంచాయత్ మహాసమ్మేళనం ఉండనుందనీ, పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు.