Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : హిజాబ్ ధరించవద్దన్నందుకు తమపై వాగ్వివాదానికి దిగారంటూ మార్చి 7న హిబాషేక్ సహా ఆరుగురు విద్యార్థులపై ఈ నెల 7న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆ రోజు కాలేజీ ఆవరణలో లేరని, దీంతో తమతో ఘర్షణపడే అవకాశం లేదని హిబా షేక్ వాదిస్తున్నారు. వివరాల ప్రకారం.. మార్చి 4న మితవాద గ్రూపుకి చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ఏబీవీపీ) విద్యార్థులు కాలేజీ గేటు సమీపంలో హిబాషేక్ సహా ఆరుగురు విద్యార్థులను దూషించారు. అనంతరం వారిని బెదిరించడంతో పాటు దాడికి దిగారు. దీంతో ముస్లిం విద్యార్థులు కూడా వారితో వాదనకు దిగారు. ఆగ్రహించిన ఏబీవీపీ వారిపై ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని అన్నారు. అయితే ఫిర్యాదుదారుడు కవన్శెట్టీ మార్చి 4న కాలేజీ ఆవరణలో లేడని, అక్కడ లేని వ్యక్తి తమతో ఎలా వాగ్వివాదానికి దిగుతారని, ఎలా ఫిర్యాదు చేస్తారని హిబా షేక్ ప్రశ్నించారు.
మంగుళూరు కార్ స్ట్రీట్‌లోని దయానంద్ పారు -సతీష్ పారు ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ గేట్ వద్ద మార్చి 3న హిబాషేక్, ఆమె స్నేహితులు, ఏబీవీపీ విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ వాగ్వివాదానికి సంబంధించిన దశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మార్చి 3న కాలేజీకి హాజరుకాకుండా తమను అడ్డుకున్నారంటూ హిబా సహా ఆమెస్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19 మంది ఏబీవీపీ విద్యార్థులపై కేసు నమోదైంది. హిజాబ్ ధరించిన తమను పరీక్షలు రాసేందుకు ప్రిన్సిపల్ అనుమతించిపన్పటికీ..ఈ 19 మంది కాలేజీలోకి రాకుండా అడ్డుకున్నారనీ, పరీక్ష రాస్తున్న తమను వారి ఫోన్లతో ఫొటోలు తీయడంతో పాటు జవాబు పత్రాలను లాక్కున్నారని అన్నారు. వారంతా తమను ఉగ్రవాదులని, దేశ వ్యతిరేకులని అవమానించారనీ, అలాగే తమ మతాన్ని గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తమపై దాడికి దిగారని మార్చి 4న హిబా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాలేజీ ప్రిన్సిపల్, సిబ్బంది అనుమతించినప్పటికీ.. వారంతా తమను వ్యతిరేకించారని, ముందస్తు ప్రణాళిక ప్రకారం తమపై కుట్ర పన్నారని హిబా ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దీంతో ఆగ్రహించిన ఎబివిపి విద్యార్థులు తమకి వ్యతిరేకంగా మార్చి 7న పూర్తి ఆరోపణలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అన్నారు.
అయితే పూర్తి విరుద్ధంగా తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఉద్దేశపూర్వకంగా తమను కేసులో ఇరికించారని హిబా పేర్కొన్నారు. శెట్టీ, అతని స్నేహితులను తాము బెదిరించామని, అనుచిత వ్యాఖ్యలు చేశామని ఆరోపించినట్లు తెలిపారు. శెట్టి, అతని స్నేహితులపై ముస్లిం విద్యార్థులు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీస్ అధికారి రాఘవేంద్ర దవీకరించారు. ఐపీసీ సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా కించపరచడం), సెక్షన్ 506 బెదిరింపులు , సెక్షన్ 504 ( శాంతికి భంగం కలిగించేందుకు ఉద్దేశ పూర్వకంగా అవమానించడం) లకింద కేసు నమోదైందని అన్నారు.