Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పుడు కాదు : ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ విజయం సాధించగా.. 2024 ఫలితాన్ని 2022లోనే ప్రజలు వెలువరించారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ తప్పుపట్టారు. రాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం మోడీ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభలో మాట్లాడుతూ.. 2024 తీర్పును ప్రజలు ఇప్పుడే ఇచ్చారంటూ మోడీ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ.. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పోరాడాల్సిందేనని, ఫలితాలు కూడా అప్పుడే నిర్ణయించబడతాయనీ, రాష్ట్రాల ఫలితాలను బట్టి కాదని అన్నారు. '2024 సార్వత్రిక ఎన్నికల్లో పోరాడాల్సిందే. తీర్పు అప్పుడే నిర్ణయించబడుతుంది. రాష్ట్ర ఎన్నికల బట్టి అప్పటి ఫలితాలు ఉండవు. ఇది సాహేబ్ (ప్రధాని మోడీ)కి తెలుసు. అందుకే ప్రతిపక్షంపై సైకాలజీకల్ అడ్వాంటేజ్ చేసేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి కధనాలకు పడిపోకండి' అని ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ట్వీట్ చేశారు.