Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషన్‌పై అత్యవసరంగా విచారించండి :
- సుప్రీం కోర్టును కోరిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులలో ఒకరిపై గురువారం దాడి జరిగిందనీ, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్‌పై అప్పీల్‌ను అత్యవసరంగా జాబితా చేయాలని కోరుతూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వి రమణ మార్చి 15 (మంగళవారం) జాబితా చెప్పారు. ఈ అంశాన్ని శుక్రవారం జాబితా చేయాలని గతంలో కోర్టు
ఆదేశించిందనీ, కానీ అది కాజ్‌లిస్ట్‌లో కనిపించలేదని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ''శుక్రవారం విచారణ జరగాల్సి ఉంది. గురువారం రాత్రి కేసు ప్రధాన సాక్షులలో ఒకరిపై దాడి జరిగింది'' అని భూషణ్ చెప్పారు. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ జోక్యం చేసుకొని ''అది తమ కార్యాలయం పొరపాటు. ఇది మంగళవారం జాబితా చేయబడుతుంది'' అని బదులిచ్చారు. గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో సహా ఎనిమిది మందిని నాలుగు చక్రాల వాహనాలతో తొక్కించి చంపిన కేసులో కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీ కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడుగా ఉన్నారు. అతన్ని అరెస్టు చేసిన తరువాత, ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్థానిక కోర్టులో 5,000 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. నవంబర్‌లో ట్రయల్ కోర్టు బెయిల్ కోసం అతని దరఖాస్తును తిరస్కరించింది. దీంతో మిశ్రా హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రాజీవ్ సింగ్ ఫిబ్రవరి 10న మిశ్రాకు బెయిల్ మంజూరు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయలేదు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. యూపీలో బీజేపీ గెలిచిందనీ, లఖింపూర్ ఖేరీలోనూ కాషాయపార్టీకి మెజార్టీ వచ్చింది. దీంతో ఇపుడు కేంద్రమంత్రి తన అనుచరులతోనే సాక్షులపై తెగబడుతున్నారని రైతు నేతలు అంటున్నారు.